బడుగు జీవి బ్రతుకు పొద్దు గడవదు.. పొట్ట నిండదు అని అనుకుంటున్నారు రాజకీయ నేతల ముచ్చట్లు విని విని విసుగు వస్తున్న జనం. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న నేతలు ఏ మాత్రం అభివృద్ధి చేశారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో.. అసలు అభివృద్ధి అనేది జరిగితే ఆకలి కేకలు, అన్నదాతల ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలవన్మరణాలు తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయని మూగబోయిన మేధావుల గొంతులు లోలోన ప్రశ్నిస్తున్నాయంటున్నారు.
రాజకీయాల్లో నీతివంతులను భూతద్దం పెట్టి వెతికినా దొరకరని అందరికీ తెలుసు. అయినా వారు చెప్పడం ఆగరు.. ఓటర్లు ఊ కొట్టడం ఆగరు అని కొందరు అనుకుంటున్నారు.. ఇకపోతే తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ (Telangana) ఉద్యమానికి వరంగల్ (Warangal)కేంద్రంగా పనిచేసిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఆరూరి రమేశ్‌తో కలిసి వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చిన కాంగ్రెస్ (Congress) వెనక్కి లాక్కుందని విమర్శించారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఉంటే శ్రీకాంతాచారి లాంటి వాళ్ల ఆత్మ బలిదానాలు ఉండేవి కాదని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కర్ఫ్యూలు, 144 సెక్షన్లు లేవని అన్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఓటర్లు నిజనిజాలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్ కుమార్ కోరారు.. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ ఆర్థికంగా అగ్రగామిగా ఉందని ఆర్బీఐ చెప్పిందనట్టు గుర్తు చేశారు వినోద్ కుమార్. .