Telugu News » Amit shah: బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం….!

Amit shah: బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం….!

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సోనియా గాంధీ లక్ష్యమని చెప్పారు.

by Ramu

కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) రెండూ కుటుంబ పార్టీలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సోనియా గాంధీ లక్ష్యమని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. ఆ రెండు కుటుంబ పార్టీలు ప్రజలకు ఏ మాత్రం మేలు చేయవని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని ప్రజలకు అమిత్ షా సూచించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కేసీఆర్ కు పట్టదన్నారు. బీజేపీ పేదల పార్టీ అని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఎటు పోయాయని ఆయన ప్రశ్నించారు.

బీసీల సంక్షేమం కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీని బలపరచండని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ మాట ఇస్తే తప్పదన్నారు. పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు.

బీసీల సంక్షేమం కోసం మొదటి సారి బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దంగా అన్ని అధికారాలు ఇచ్చి బీసీల హక్కులను కాపాడే ప్రయత్నం చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమం కోసం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయాన్ని మంజూరు చేశామన్నారు. దానికి సమ్మక్క సారక్క విశ్వ విద్యాలయం అని పేరు పెట్టామని చెప్పారు.

కృష్ణ నది జలాలపై తెలంగాణ హక్కుల కోసం తాగు నీటి, సాగు నీటి కోసం కృష్ణ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మోడీ తీసుకు వచ్చారని అన్నారు. కిసాన్ సమ్మాన్ కింద తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు రూ. 9 వేల కోట్ల కోట్లను నాలుగు నెలలకు ఒక సారి రైతుల అకౌంట్లలో ప్రధాని మోడీ జమ చేస్తున్నారని చెప్పారు.

 

You may also like

Leave a Comment