Telugu News » Almonds : బాదం రోజూ తింటున్నారా.. అయితే మీ హెల్త్ ప్రమాదంలో ఉన్నట్టే..?

Almonds : బాదం రోజూ తింటున్నారా.. అయితే మీ హెల్త్ ప్రమాదంలో ఉన్నట్టే..?

బాదంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక క్యాలరీలు చేరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. దీంతో బరువు పెరుగుతారు

by Venu

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు.. అందుకే ఆరోగ్యంగా ఉండడానికి నేటి కాలంలో వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలు. అందులో గుప్పెడు బాదం పప్పులను తినడం.. ఈ బాదం ఆరోగ్యానికి మంచిదే.. అయితే బాదం ఎక్కువైతే మాత్రం హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ బాదంలో జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

అందుకే చాలా మంది బాదం (Almonds) రాత్రి నానబెట్టి ఉదయం తీసుకుంటారు.. అయితే ఈ పప్పును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పక్కనపెడితే.. వీటిని అతిగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు హెల్త్ ప్రొఫెషనల్స్ (Health Professionals).. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బాదం పప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ ఇ (E) స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.. అంతేగాక శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, రక్తస్రావం ఎక్కువవుతుందని హెల్త్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు.. శరీరంలో విటమిన్ ఇ ఎక్కువైతే కొన్నిసార్లు విషంగా మారే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటుగా ఇంకా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ (Infections) వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఇక ఈ బాదం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.. తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతారు..

మరోవైపు బాదంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక క్యాలరీలు చేరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. దీంతో బరువు పెరుగుతారు. అంతే కాకుండా బాదంపప్పులో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెల్త్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. అలాగే బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎక్కువవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించదు.. కాబట్టి బాదం మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి శుభకరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

You may also like

Leave a Comment