Telugu News » Selfie Video: ‘రాజన్న సన్నిధిలో ఆత్మహత్య చేసుకుంటాం..’ సెల్ఫీ వీడియో కలకలం..!

Selfie Video: ‘రాజన్న సన్నిధిలో ఆత్మహత్య చేసుకుంటాం..’ సెల్ఫీ వీడియో కలకలం..!

ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా(Manchiryal Dist) కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో కలకలం రేపింది.

by Mano
Selfie Video: 'We will commit Death in Rajanna's presence..' Selfie video is disturbing..!

రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో(Selfie Video) కలకలం రేపింది. బీఆర్ఎస్ నాయకుడు వేధింపులు తాళలేక తాన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా(Manchiryal Dist) కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో కలకలం రేపింది.

Selfie Video: 'We will commit Death in Rajanna's presence..' Selfie video is disturbing..!

తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వేములవాడ రాజన్న దేవాలయం సన్నిధిలో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని వీడియోలో వాపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అక్టోబర్ 22వ తేదీన అర్ధరాత్రి మోటపల్లి గురువయ్య ఓ సుపారీ గ్యాంగ్‌ను పంపించి రాజేందర్‌పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటనను ఇరుగుపొరుగు వారు చూశారు.

ఈ ఘటనపై రాజేందర్ లక్షెట్టిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. అయితే బీఆర్ఎస్ నాయకుడు గురువయ్య తనను ఎందుకు వేధిస్తున్నాడనే విషయం రాజేందర్ ఆ వీడియోలో చెప్పలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment