క్రికెట్ మైదానంలో భారత్ బరిలో ఉందంటే అభిమానులకి పూనకాలు వస్తాయని ఎన్నో సార్ల నిరూపించబడింది. భారత్ పాల్గొన్న ప్రతి ఆటలో విజయం వరించాలని అభిమానులు పూజలు, అభిషేకాలు కూడా చేసిన రోజులు మరచిపోలేము. మరికొందరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే తాహతుకు మించి ముందుకు వెళ్తారు. వారికున్న నైపుణ్యంతో భారత్ జట్టును ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తారు..
తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్ (Pastry Chef)..భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ ఇండియా వరల్డ్‌కప్‌ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో (Chocolate) ప్రపంచకప్ ట్రోఫీని (World Cup Trophy) ఈ చెఫ్ తయారు చేశారు. టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు తాము ఈ చాక్లెట్ రెప్లికాను (Chocolate Replica) తయారు చేశామని పేస్ట్రీ చెఫ్ రాకేశ్ సాహు (Rakesh Sahu)పేర్కొన్నారు..
ఈ చాక్లెట్ రెప్లికా తయారీలో మరో ఎనిమిది మంది సహాయ సహకారాలు అందించారని, తయారీకి మూడు రోజులు పట్టిందని రాకేశ్ సాహు తెలిపారు. మూడు స్తంభాలు వాటిపై బంతిని చాక్లెట్లతో తయారు చేయడం చాలా కష్టమైందన్నారు. చాక్లెట్ కరగకుండా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం సవాల్ గా మారిందని వెల్లడించారు.
మరోవైపు వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో ఐదు వరుస విజయాలతో టీమ్ఇండియా (Team India)రెండో స్థానంలో దూసుకు పోతుంది. వీరి దూకుడు చూస్తుంటే మరోసారి ప్రపంచకప్ సాధిస్తుందని, శతకోటి ఆశలతో.. కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. భారత జట్టుకు మద్దతు ఇస్తున్నారు.