టీజేఎస్ కార్యాలయానికి(TJS OFFICE) టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) చేరుకున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(TJS President Kodandaram)తో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, కోదండరాం భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
కలిసి పనిచేద్దామని ఇప్పటికే ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. రాహుల్‌తో భేటీ అయి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకారానికి వచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు తెలపాలని కోదండరాంను రేవంత్ కోరనున్నారు. ప్రభుత్వం వచ్చాక కోదండరాంకి సముచిత గౌరవం ఇస్తామని రేవంత్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదా, మద్దతు విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతో కరీంనగర్ వీ పార్క్ హోటల్లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు చెప్పారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు.
తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ పాలనపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. మరోసారి రాహుల్ టీం తమతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేవంత్‌తో కోదండరాం భేటీతో ఉత్కంఠ నెలకొంది.