Telugu News » Joe Biden : ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధం పై జో బైడెన్‌ కీలక సూచన..!!

Joe Biden : ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధం పై జో బైడెన్‌ కీలక సూచన..!!

హమాస్​ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. జాలి దయా లేని తుపాకి గుండ్లకు గాజాలోని సామాన్య పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు

by Venu

యుద్ధాలు దౌర్జన్యాలూ మనుషుల జీవితాలను, ఆలోచనలను మార్చలేవు.. ఒక్క నవ్వునీ పూయించలేవు.. ఒక్క పువ్వునీ పరిమళించనీవు.. యుద్ధం అనంతరం అక్కడి ప్రజల జీవితాలు బతుకు వెలుగుని చూడలేవు.. ఇలా ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఇదే నీతి బోధించాయి.. అయినా ఆధిపత్యం దాహం తీరడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హ‌మాస్ యుద్ధం కూడా చరిత్రకు పాఠం నేర్పుతుందని అంతా అనుకుంటున్నారు.

ప్రస్తుతం మనుషుల ప్రాణాల రుచి మరిగిన రణరంగం ఇజ్రాయెల్‌-హ‌మాస్ (Israel-Hamas) యుద్ధం (war).. ఈ యుద్ధంలో అసువులు బాస్తున్న అమాయకుల ప్రాణాల కోసం ఇరువురు ఆలోచించడం లేనట్టు తెలుస్తుంది.. ఆర్తనాదాలతో, ఆకలి కేకలతో, మరణ ఘోషలతో ఇక్కడి నేల పూర్తిగా బండబారి పోయిన కొంచెం అయినా కనికరం కలగడం లేదు..

మరోవైపు హమాస్​ను సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. జాలి దయా లేని తుపాకి గుండ్లకు గాజాలోని సామాన్య పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నరమేధాన్ని ముక్తకంఠంతో ప్రపంచమంతా ఖండిస్తున్నా..ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​కు మద్దతుగా నిలిచిన అమెరికా కీలక సూచన చేసింది.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)తో ఫోన్‌లో మాట్లాడినా జో బైడెన్‌ (Joe Biden)..హమాస్‌ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని కోరారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందని బైడెన్‌ పేర్కొన్నారు.. మరోవైపు గాజా (Gaza)యుద్ధం కారణంగా గజగజ వణికిపోతోంది. ఇక్కడి పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది..

You may also like

Leave a Comment