Telugu News » CM KCR : మెదక్ ఎంపీ పై దాడి చేసింది ఎవరో చెప్పిన కేసీఆర్..!?

CM KCR : మెదక్ ఎంపీ పై దాడి చేసింది ఎవరో చెప్పిన కేసీఆర్..!?

ప్రభాకర్ రెడ్డి పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీ కుట్ర అని కేసీఆర్ మండిపడ్డారు.. చేతగాని వెధవలు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతారని సీరియస్ అయ్యారు.

by Venu
CM KCR

మెదక్ ఎంపీ (MP) కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) పై జరిగిన హత్యాయత్నంలో ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నట్టు పార్టీ వర్గాలలో అనుకుంటున్నారనే వార్తలు ప్రచారం జరుగుతుంది. ఈ హత్యాయత్నం వెనక ఏ రాజకీయ కుట్ర లేకుంటే నిందితుడు అంత మందిలో దాడి చేసేవాడు కాదనే మాటలు వివిధ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ కోడి కత్తి అటాక్ లా ఈ దాడి ఉందనే అనుమానాలను పలువురు లేవనెత్తుతున్నారు..

cm kcr

మరోవైపు ఈ ఘటన పై సీఎం కేసీఆర్ (CM KCR) స్పందించారు. ప్రభాకర్ రెడ్డి పై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీ కుట్ర అని కేసీఆర్ మండిపడ్డారు.. చేతగాని వెధవలు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతారని సీరియస్ అయ్యారు. ప్రభాకర్‌పై దాడి జరిగిందంటే నాపై దాడి జరిగినట్లే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ చూడలేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. నేతలు చేసే గారడీలు చూసి నిజమని నమ్మి మోసపోకండని ఓటర్లకు తెలిపారు.. బ్రహ్మాస్త్రం లాంటి ఓటుని సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి ఉపయోగించాలని కేసీఆర్ అన్నారు. ఓడిపోతాం అనే భయంతో కొందరు ఎన్నికల్లో ఎదుర్కోలేక హింసలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల‌క్షన్లు వ‌చ్చిన‌ప్పుడు అనేక పార్టీలు వ‌చ్చి కల్లబొల్లి మాటలు ఎన్నో చెప్తాయి. కానీ ఆలోచ‌న చేసి ఓటు వేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.. కాగా సోమవారం బాన్సువాడ (Banswada)లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీ పై ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే.. దాడి విషయం తెలియగానే మంత్రి హరీష్ రావు (Harish Rao) వెంటనే అక్కడికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.. ఘటన గురించి ఆరా తీశారు..

You may also like

Leave a Comment