తెలంగాణా (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly-Election)వేళ బీఆర్ఎస్(BRS) కాంగ్రెస్ (Congress)మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో సాగుతుంది. మరోవైపు అసలు పోటీలో బీజేపీ (BJP)ఉందా లేదా! అని అనుమానం కలిగేలా టామ్ అండ్ జెర్రీ ఆటను బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే ఆడుకుంటున్నాయని జనం మాట్లాడుకుంటున్నారు.
నిత్యం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్రస్థాయిలో చేసుకోవడం కనిపిస్తూనే ఉంది. కాగా హుజూర్‌నగర్ (Huzurnagar) కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)..సీఎం కేసీఆర్ ని ఎండగట్టారు.. నిన్న కోదాడలో నిర్వహించిన బహిరంగ సభలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉత్తమ్ ఎద్దేవా చేశారు..
ఎప్పుడో 60 ఏళ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ అది దృఢంగా ఉంది. కానీ మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొన్ని నెలలకే కుంగి పోయిందని ఉత్తమ్ విమర్శించారు. లక్షల కోట్లు ప్రాజెక్టు పేరుతో ఖర్చుపెట్టి వేల కోట్లు దోచుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ప్రాజెక్టులో దోపిడి జరగకుంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయే కాదని అన్నారు..
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయని కేసీఆర్.. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీలను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుంటే ఓర్వలేక అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. హుజూర్‌నగర్ లో అరాచక పాలన సాగిస్తున్న సైదిరెడ్డితో పాటు కేసీఆర్ ని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. తుపాకి రాముడిలా అబద్దాలు చెప్పుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తెలంగాణలో 90 శాతం మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు..