హైదరాబాద్(Hyderabad) నగర వాసులు ప్రస్తుతం భవిష్యత్తు గురించి ఆలోచించి నీటిని వాడుకోవాలి. ఒక చుక్క నీటిని కూడా వృథా కానివ్వకూడదు. ఎందుకంటే మంజీరా వాటర్(Manjeera Water) భాగ్యనగరంలో బంద్ కానుంది. నగరవాసుల దాహార్తిని తీరుస్తున్న మంజీరా నీటినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు అలెర్ట్ జారీ చేశారు.
వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో మంజీరా వాటర్ సరఫరా అయ్యే పైపుల లీకేజీలు ఎక్కువయ్యాయి. ఎప్పటి నుంచో ఈ పనులు పెండింగ్ పడుతున్నాయి. తాగునీరు వృథా అవుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ లీకేజ్ పైపులను రిపేర్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పైపు లీకేజీల మరమ్మతుల నిమిత్తం తాగునీటి సరఫరాను బంద్ చేయాలని హుకూం జారీ చేశారు.
పైపు లీకేజీల మరమ్మతులు చేయడానికి బుధవారం నుంచి గురువారం వరకు అంటే 48గంటలు నగరంలో మంజీరా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే తిరిగి గురువారం ఏ సమయానికి నీళ్లు వస్తాయో కూడా తెలపలేదు. దీంతో ఎప్పుడు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కనుక నగర వాసులంతా అప్రమత్తంగా ఉండి ఇవాళే నీటిని పట్టిపెట్టుకుంటే మంచిది.
నగరంలో తాగునీటి సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. మరీ ముఖ్యంగా వేసవిలో ఆ కష్టాలేవేరు. ప్రస్తుత పరిస్థితుల్లో నగర వాసులు ఎక్కువగా మినరల్ వాటర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు ఇళ్లలోనే వాటర్ పిల్టర్లను పెట్టుకుంటున్నారు. మంజీరా వాటర్‌ను నిత్యావసరాలకు వినియోగిస్తున్నారు. 48గంటల పాటు నీరు బంద్ కానున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.