Telugu News » Priyanka-Gandhi : ట్విస్ట్ ఇచ్చిన హస్తం.. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!!

Priyanka-Gandhi : ట్విస్ట్ ఇచ్చిన హస్తం.. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!!

ఈ రోజు ప్రియాంక గాంధీ (Priyanka-Gandhi) తెలంగాణ వస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆమె పర్యటన దాదాపు ఖరారైంది.. ఈ విషయం గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నిమిషయంలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

by Venu
Priyanka Gandhi

తెలంగాణలో (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly-Elections) నేపథ్యంలో కాంగ్రెస్ (Congress)పలు జిల్లాల్లో బస్సు యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వరంగల్ లో నిర్వహించిన సభకు రాహుల్ ప్రియాంక గాంధీ హాజరై తన కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. తర్వాత ప్రియాంక గాంధీ వెళ్ళిపోయిన రాహుల్ మాత్రం పలు నియోజక వర్గాలలో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Priyanka Gandhi

తాజాగా ఈ రోజు ప్రియాంక గాంధీ (Priyanka-Gandhi) తెలంగాణ వస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆమె పర్యటన దాదాపు ఖరారైంది.. ఈ విషయం గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నిమిషయంలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ లో జరగనున్న మహిళా సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. దీంతో ఆమెకు బదులుగా రాహుల్ గాంధీ సభకు హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే మొదటి విడత బస్సు యాత్రలో రాహుల్ పాల్గొని ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment