Telugu News » Apple Phones Hacking: ప్రతిపక్షాలపై ఎవరో ఫ్రాంక్ చేసి ఉంటారు…..!

Apple Phones Hacking: ప్రతిపక్షాలపై ఎవరో ఫ్రాంక్ చేసి ఉంటారు…..!

దానిపై ప్రతిపక్ష నేతలు అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

by Ramu
AP as a kingdom for mafias.. Central Minister Piyush Goyal's sensational comments!

యాపిల్ ఫోన్ల హ్యాకింగ్ (APPle Phones Hacking) కలకలంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goel) స్పందించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. బహుశా ప్రతిపక్ష నేతలపై ఎవరైనా ఫ్రాంక్ చేసి ఉండవచ్చని ఎద్దేవా చేశారు. దానిపై ప్రతిపక్ష నేతలు అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

I Think Someone Pranked Opposition Leaders Minister Piyush Goyal On Hacking Row

ఆ ఫిర్యాదుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకునేందుకు కేంద్రం రెడీగా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం అత్యంతం బలహీనమైన దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతిపక్ష నేతలు ప్రతి విషయంలో కుట్రను చూస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. వాస్తవమేమిటంటే సాఫ్ట్ వేర్ లోపం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని యాపిల్ సంస్థ వెల్లడించిందన్నారు.

ఇలాంటి సందేశం మొత్తం 150 దేశాల్లోని ప్రజలకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఇది యాపిల్ సాఫ్ట్ వేర్ లోపం వల్ల వచ్చినట్టు తెలుస్తోందన్నారు. హ్యాకర్లు కూడా ప్రపంచవ్యాప్తంగా చురుకుగా ఉన్నాని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. దర్యాప్తుకు సహకరించాలని యాపిల్ ను కోరామన్నారు.

ప్రతిపక్షాలు తాము కోరుకున్నట్టు ఆరోపణలు చేసుకోవచ్చన్నారు. కానీ వారి పరిస్థితి దేశ ప్రజలకు తెలుసని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు తమ కూటమిలో అంతర్గత పోరులో చిక్కుకుపోయారన్నారు. బీజేపీపై వ్యాఖ్యలు చేసే బదులు ముందు వారి బలహీనతలను చూసుకోవాలని చురకలు అంటించారు.

You may also like

Leave a Comment