ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) కేసులో చంద్రబాబుకు మంగళవారం మధ్యాహ్నం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 52 రోజుల పాటు రాజమండ్రి (Rajahmundry) జైలులో ఉండి విడుదలైన తమ అభిమాన నేత కోసం అశేష జనవాహిని కదిలి వచ్చింది. అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. బాబు దాదాపు 13 గంటల పాటు జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
సుమారు ఐదు గంటల సమయంలో ఉండవల్లి నివాసానికి చేరుకున్న బాబుకు ఆయన భార్య భువనేశ్వరి హారతి ఇచ్చి దిష్టితీసి లోపలికి ఆహ్వానించారు. మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన బాబును చూసిన టీడీపీ నేతలు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు (Chandrababu) కూడా అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను చూసి ఎమోషన్ అయ్యారు.
కాగా చంద్రబాబుకు బ్రహ్మణి టీడీపీ జెండాను అందించగా బాలకృష్ణ ప్రసాదాన్ని తినిపించారు. మరోవైపు చంద్రబాబు విజయవాడ చేరుకునే సరికి రాత్రి 4 గంటలు దాటింది. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న నాయకులు కార్యకర్తలు చంద్రబాబుకు బెంజిసర్కిల్‌లో అపూర్వస్వాగతం పలికారు. విజయవాడ నగరానికి చెందిన మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.
ఈ స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనూరాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్నితో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. మరోవైపు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లికి వెళ్లారు. ఇక కేశినేని భవన్ వద్ద టీడీపీ నేత కేశినేని శ్వేత నేతృత్వంలో చంద్రబాబుకు కేశినని కుమార్తె శ్వేత పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.