మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరాఠా కోటా ఉద్యమంతో ఆ రాష్ట్రం రగిలిపోతోంది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. పలు చోట్ల ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు.
ఈ క్రమంలో పరిస్థితిపై చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కోటా కార్యకర్త మనోజ్ జరంగే(Manoj Jarange) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకోగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఐదు మరాఠ్వాడా జిల్లాల్లో ప్రభుత్వ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. నిరసనకారులు ఐదు మరాఠ్వాడా జిల్లాల్లో ప్రభుత్వ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. నిరసనకారులు రాజకీయ నాయకుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న బీడ్‌లోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. పలు నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 99మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు మజల్‌గావ్‌లో మునిసిపల్ కౌన్సిల్ భవనానికి నిప్పు పెట్టారు. మరాఠా కోటాకు మద్దతు తెలుపుతూ ఇద్దరు శిందే వర్గానికి చెందిన సేన ఎంపీలు, ఓ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేశ్ వార్పుడ్కర్, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పవార్ కూడా రాజీనామా చేశారు.