Telugu News » బైబై.. బీజేపీ 

బైబై.. బీజేపీ 

బీజేపీ నేతలు ఎన్నిసార్లు ఖండించినా ఆయన తీరు డౌట్ గానే ఉందని చెప్పింది 'రాష్ట్ర'. ఇప్పుడు అదే జరిగింది.

by Ramu

– బీజేపీని వరుసగా వీడుతున్న నేతలు
– వివేక్ వెంకటస్వామి రాజీనామా
– ముందే చెప్పిన ‘రాష్ట్ర’
– అనుమానంగా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి తీరు
– రాకేష్ రెడ్డి సైతం రాజీనామా
– బీజేపీలో సిద్దాంతాలు లేవని విమర్శ
– ప్రజా నాయకులను బలి చేస్తున్నారంటూ ఆగ్రహం
– డీకే అరుణ ఉండేది పార్లమెంట్ ఎన్నికల దాకేనా?
హైదరాబాద్, రాష్ట్ర: బీజేపీ (BJP) విజయం పక్కా అని ఆపార్టీలోని కొందరు నేతలు చెబుతుంటే.. ఇంకోవైపు మరికొందరు నేతలు జంప్ అవుతున్నారు. వివేక్ వెంకటస్వామి (Vivek Venkat swamy) పార్టీ మార్పు విషయంలో.. బీజేపీ నేతలు ఎన్నిసార్లు ఖండించినా ఆయన తీరు డౌట్ గానే ఉందని చెప్పింది ‘రాష్ట్ర’. ఇప్పుడు అదే జరిగింది. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు.

తాజాగా వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఈమధ్య రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు వివేక్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అని వార్తలు వచ్చాయి. కానీ, బీజేపీ నేతలు దీన్ని ఖండించారు. కానీ, చివరకు జంప్ అయ్యారు. కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. హస్తం కండువా కప్పుకున్నారు. వివేక్‌తో పాటు ఆయన కుమారుడు వంశీకృష్ణ కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసికట్టుగా ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు వివేక్. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. తనకు టికెట్ ముఖ్యం కాదని బీఆర్ఎస్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు.

సోనియా తెలంగాణ ఇచ్చారని.. రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఇటు, సీనియర్ నేత రాకేష్ రెడ్డి కూడా రిజైన్ చేశారు. బీజేపీలో సిద్దాంతాలు లేవని అన్నారు. మొన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు వివేక్, రాకేష్ రెడ్డి.. నెక్స్ట్ ఎవరు అనే చర్చ జోరందుకుంది. విజయశాంతి చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె కూడా జంప్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీకే అరుణ కూడా పార్లమెంట్ ఎన్నికల దాకే ఉండే ఛాన్స్ అందని వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొందని అంతా అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment