Telugu News » Congress: కాంగ్రెస్ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు……!

Congress: కాంగ్రెస్ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు……!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేవలం మూడు గంటల కరెంట్ చాలంటున్నారని అన్నారు. మూడు గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా ప్రజలే తేల్చుకోవాలన్నారు.

by Ramu
congress

కాంగ్రెస్ (Congress) వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేవలం మూడు గంటల కరెంట్ చాలంటున్నారని అన్నారు. మూడు గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా ప్రజలే తేల్చుకోవాలన్నారు.

cm kcr criticized the congress party

నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో గిరిజనులకు రైతు బంధు ఇచ్చామని చెప్పారు. పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. నిర్మల్‌కు ఇంజనీరింగ్ కాలేజీ అడిగారని, మంజూరు చేయిస్తానని చెప్పారన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ లేదు.. గడబిడ లేదన్నారు. ధరణి వల్ల రైతులు చాలా నిశ్చింతగా ఉన్నారని అన్నారు. ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలని అడిగారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పైరవీకారులు పుట్టుకు వస్తారని చెప్పారు. మా తండాల్లో మా రాజ్యాన్ని తీసుకు వచ్చామన్నారు. తండాలు గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామన్నారు.

4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలను మంజూరు చేశామన్నారు. ప్రజా హక్కుల కోసం 15 ఏండ్లు పోరాడమన్నారు. చివరకు చావు నోట్లో తలకాయపెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తాను చెప్పే మాటలను గ్రామాల్లో, మీ బస్తీల్లో చర్చ పెట్టాలని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు.

రాష్ట్రంలో అభివృద్ధి అలాగే కొనసాగాలంటే బీఆర్‌ఎస్ ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసమన్నారు. 30న ఓట్లు వేస్తారని అన్నారు. డిసెంబర్ 3న లెక్క తీస్తారని పేర్కొన్నారు. ఎవరో ఒకరు గెలుస్తారని అన్నారు.. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక ఓటు వజ్రాయుధం అన్నారు.

You may also like

Leave a Comment