Telugu News » Delhi : వాట్సప్ కాల్ చేశారు..రూ.12.8 లక్షలు మాయం చేశారు..

Delhi : వాట్సప్ కాల్ చేశారు..రూ.12.8 లక్షలు మాయం చేశారు..

సైబర్ నేరగాళ్ల (Cybercriminals) వలలో ఉన్నత విద్యావంతులతో పాటు పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు కూడా పడటం విడ్డూరం.. ఇలాంటి సంఘటనే దేశ రాజధానిలో జరిగింది.

by Venu

సమాజంలో జరుగుతున్న నేరాల (Crime)పై పోలీసులు (Police) అవగాహన కల్పిస్తున్న కానీ మోసపోయే వారు మోసపోతూ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ మోసాల పై ప్రచారం కలిపిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల (Cybercriminals) వలలో ఉన్నత విద్యావంతులతో పాటు పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు కూడా పడటం విడ్డూరం.. ఇలాంటి సంఘటనే దేశ రాజధానిలో జరిగింది.

ఢిల్లీ (Delhi)లో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వృద్ధుడికి వాట్సప్ కాల్ (WhatsApp Call) వచ్చింది. ఆ కాల్ రిసీవ్ చేసుకొన్న వృద్ధుడికి ఓ మహిళ న్యూడ్ గా కనిపించింది. విషయం అర్థం కానీ వృద్ధుడు అయోమయంలో ఉండగా.. ఆ మహిళ వీడియో కాల్ సమయంలో బాధితుడి స్క్రీన్ షాట్ తీసింది. వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాత నుంచి వృద్ధుడికి వివిధ నంబర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. అతన్ని బెదిరిస్తూ వీడియోను, స్క్రీన్‌షాట్‌ను ఆన్‌లైన్‌లో పెడతామని సైబర్ నేరగాళ్లు బెదిరించడం మొదలుపెట్టారు.

ఇలా బెదిరించి ఆ వృద్ధుడి నుంచి రూ.12.8 లక్షలు వసూలు చేశారు. అయినా వారి బెదిరింపులు ఆగకపోవడంతో ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారు రాజస్థాన్‌కు చెందిన బర్కత్ ఖాన్, రిజ్వాన్‌ గా ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా ధృవీకరించారు..

మరోవైపు నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, పలు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా విచారణలో ఈ ముఠా వీడియో కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు.. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసాగాళ్ల విషయంలో టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

You may also like

Leave a Comment