ఎన్టీఆర్ రాజకీయాల్లో సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 1981లో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్వహించడం వంటి చర్యల వలన రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో నందమూరి బసవతారకం గారు ఈ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పారు. ప్రజలకి న్యాయం చేయడం కోసమే అలాగే విలేకరుల ముందు ప్రకటన చేయాలని చెప్పారు. 1981లో సర్దార్ పాపారాయుడు షూటింగ్ టైంలో ఒక విలేకరి మరో ఆరు నెలల్లో మీరు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. మీ జీవితం కి సంబంధించిన ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా అని ఎన్టీఆర్ ని అడిగారు.
అప్పుడు ఎన్టీఆర్ తర్వాత పుట్టినరోజు నుండి ప్రతినెలా 15 రోజులు పాటు ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. బసవతారకం నందమూరి తారకరామారావు గారి రాజకీయ ప్రవేశానికి నాంది అని చెప్పారు. తర్వాత ఆయన చేయాల్సిన పనులు త్వరగా చేశారు. 1982 మార్చి 28న హైదరాబాద్ కి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారు 1982 మార్చి 28 మధ్యాహ్నం రెండు గంటలకి కొత్తగా పార్టీని ప్రకటించారు. అలా టిడిపి ఆవిర్భావం జరిగింది. దానికే చైతన్య రథం అని పేరు కూడా పెట్టారు.
Also read:
ఒక సామాన్య శ్రామికుడిగా కార్మికుడిలా ఆత్మ పరిరక్షణ అనే ఒక ఉద్వేగణితమైన విషయాన్ని తీసుకుని ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ఎన్నో వివాదాస్పత నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పదవీ విరమణ తగ్గింపు ఒకటి కాంగ్రెస్ ఎతర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి పాలించిన వ్యక్తి ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేసేటువంటి కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. 1989లో మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రి వర్గాన్ని తీసుకున్నారు. ఆ సమయంలో కూడా కొన్ని కుల ఘర్షణలు ఎన్టీఆర్ ప్రతిష్టని దెబ్బతీసాయి ఇలా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ఎన్నో అవమానాలని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.