ధరణి రాక ముందు రాష్ట్రంలో లంచాల రాజ్యం నడుస్తుండేదని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఇప్పుడు నిమిషాల్లోనే పట్టాలు చేతికి వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నుంచి భట్టి వరకు ధరణి తీసేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ లేదని, అదే రాజ్యం రావాలా ఇదే రాజ్యం ఉండాలా తేల్చుకోవాలన్నారు.
భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. వ్యవసాయ స్థిరీకరణ కోసం మేధావులతో చర్చించామన్నారు. గతంలో గడ్డెన్న ప్రాజెక్టు ద్వారా 4వేల ఎకరాలకు నీరు అందేదన్నారు. కానీ టీఆర్ఎస్ సర్కార వచ్చాక ఇప్పుడు 12 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌తో బ్రహ్మాండమైన పరిస్థితులున్నాయని వివరించారు. ఎన్నికలు వస్తాయి పోతాయన్నారు. ఎవరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ఎవరో చూడాలని అన్నారు. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం అని చెప్పారు. ఆలోచించి ఓటు వేయాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ 50 ఏండ్లు పాలించిందన్నారు. ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్ పదేండ్లు ఉందన్నారు. ఏ పార్టీ ఏంటో చూడాలన్నారు. చరిత్ర ముందు ఉందని పేర్కొన్నారు. రైతు బంధు దుబారా, మూడు గంటల కరెంట్ అని రేవంత్ అంటున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో లైట్ లేదన్నారు. మన దగ్గర లైట్ ఉందన్నారు.
దేశంలో అన్నింటినీ మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడుతామన్నారని అన్నారు. దాన్ని తాను వద్దన్ననన్నారు. దీంతో నిధులు కట్ చేశారని తెలిపారు. వ్యవసాయం బాగుపడాలని మీటర్లు పెట్టలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టబోమని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 25వేల కోట్లు నిధులు ఇవ్వలేదని కట్ చేశారన్నారు.