ఏపీ (AP) ప్రభుత్వంపై విజయవాడ (Vijayawada)కు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ (Lingamaneni Sivarama Prasad) సుప్రీంకోర్టులో (Supreme Court) పిల్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు, ఎన్టీజీలో కేసు పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు, కార్యక్రమాలు రుషి కొండపై చేపట్టకుండా చూడాలంటూ లింగమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఏ ఉల్లంఘనలకు పాల్పడినందున వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కార్ అక్టోబర్ 11, 2023న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ నేత సుప్రీంకోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో రిషికొండపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఆ విచారణలో రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ.. రుషికొండకు సీఎంను వెళ్లవద్దని అంటున్నారు.. ఇందులో ప్రజా ప్రయోజనం కనిపించడం లేదని పేర్కొంది. రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించింది. రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది..
ఈ కేసు హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద పెండింగ్ లో ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో లింగమనేని శివరామ ప్రసాద్‌కు ఎదురు దెబ్బ తగిలింది.. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్ళడానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది..