Telugu News » Kaleswaram : కాలనాగులా మారిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ ఖేల్ ఖతమా..??

Kaleswaram : కాలనాగులా మారిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ ఖేల్ ఖతమా..??

కాంగ్రెస్ (Congress).. కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ (CBI) విచారణ కోరుతు రాష్ట్రపతికి లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.

by Venu
Kaleswaram Project Defects

కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కలిపించాలని ఒకగానొక సమయంలో బీఆర్ఎస్ (BRS) నేతలు ముక్త కంఠంతో కేంద్రం పై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ (KCR) మానస పుత్రిక కాళేశ్వరం అని.. నాడు గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మెడకు.. అదే కాళేశ్వరం కాలనాగులా చుట్టుకుంటుందని ఊహించలేక పోయారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు.

Kaleswaram Project Defects

ఇప్పటికే మేడిగ‌డ్డ బ్యారేజ్ నిర్మాణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌నీస ప్ర‌మాణాలు కూడా పాటించ‌లేద‌ని సెంట్ర‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు కాళేశ్వరం విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రాజెక్ట్ లోపాలను బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇంకా దూకుడు పెంచిన కాంగ్రెస్ (Congress)..కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ (CBI) విచారణ కోరుతు రాష్ట్రపతికి లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.

సీబీఐతో కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్.. రాష్ట్రపతికి లేఖ రాసింది. గత నెలలో రాష్ట్రంలో పర్యటించిన డ్యామ్‌ సేప్టీ అథారిటీ అధికారులు 20 అంశాలపై వివరణ కోరగా..తెలంగాణ ప్రభుత్వం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ లేఖలో కోరింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత గాలితో దీపంలా మారిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర ప్రజల భద్రతతో ముడిపడి ఉన్న సమస్యగా కాళేశ్వరం వివాదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

మరోవైపు కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పిల్లర్లకు భారీ పగుళ్లు ఏర్పడ్డ విషయాన్ని లేఖలో తెలిపింది. పిల్లర్లు కుంగిన ప్రాంతంలో వంతెన కూడా కుంగిందని కాంగ్రెస్ వెల్లడించింది. కాగా రోజు రోజుకి సంచలనంగా మారుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా లేదు.. మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాళేశ్వరం ప్రభావం ఏ మేరకు చూపిస్తుందో చూడాలని జనం అనుకుంటున్నారు.. ఈ దెబ్బతో బీఆర్ఎస్ ఖేల్ ఖతమా? అని చెవులు కొరుక్కుంటున్నారు..

You may also like

Leave a Comment