Telugu News » Kavitha : కవిత టైమ్ వస్తుంది..!

Kavitha : కవిత టైమ్ వస్తుంది..!

తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే మోసం చేశారని ఆరోపించారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.

by admin
Anurag Thakur Sensational Comments on CM KCR and Kavitha

– తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే
– ప్రతి ఒక్కరి నెంబర్ వస్తుంది
– తెలంగాణలో తిన్నది సరిపోక..
– కవితను ఢిల్లీ పంపారు కేసీఆర్
– కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్
– అబద్ధపు కాంగ్రెస్ గ్యారెంటీలతో నో యూజ్
– కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర వ్యాఖ్యలు

ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కాం అంశంలో కేంద్రం మెతక వైఖరి వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కయ్యాయని అందుకే కవిత (Kavitha) పై చర్యలు లేవంటూ కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికల టైమ్ కావడంతో ఈ అంశాన్ని బాగా క్యాష్ చేసుకుంటోంది. సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR).. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారని సెటైర్లు వేశారు.

Anurag Thakur Sensational Comments on CM KCR and Kavitha

తెలంగాణ (Telangana) లో తిన్నది సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపారని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి నెంబర్ వస్తుందన్న ఆయన… అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని.. ఇది బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని ఎద్దేవ చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే మోసం చేశారని ఆరోపించారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.

ఇక, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అనురాగ్ ఠాకూర్. ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్‌ లో కాంగ్రెస్ ఎంతో దోచుకుందని విమర్శించారు. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని గుర్తుచేశారు. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోందని ఆరోపించారు. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోందన్న ఆయన… దేవుడి పేరును చెడగొట్టారని మండిపడ్డారు. దాదాపు రూ.508 కోట్లు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్‌ కు అందాయని సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ కావడం లేదని అన్నారు కేంద్రమంత్రి. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారని అన్నారు. పార్లమెంట్‌ లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం వరల్డ్ కప్ జరుగుతోందని… ఇందులో మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోందన్న ఆయన.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్‌ మెన్‌ గా పార్టీ జాతీయ నాయకత్వం తనను పంపిందని చెప్పారు. శనివారం గోషామహాల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment