Telugu News » Revanth reddy : కేసీఆర్ అవినీతికి కేంద్రం మద్దతు!

Revanth reddy : కేసీఆర్ అవినీతికి కేంద్రం మద్దతు!

కేంద్రం అర్ధాంతరంగా ఒక నివేదిక ఇచ్చి వదిలేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ వ్యవహారంపై కేంద్రం తరఫున ఎవరూ మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి నుంచి బీజేపీ.. బీఆర్ఎస్ ​కు ప్రొటెక్షన్​ మనీ ఇస్తోందని.. అందుకే, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

by admin
revanth-reddy-sensational-comments-on-cm-kcr

– కేసీఆర్ అవినీతిపై చర్యలేవి?
– మోడీ మౌనానికి కారణమేంటి?
– కాళేశ్వరం అవినీతిపై..
– సీబీఐతో విచారణ జరిపించాలి
– కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ బలయ్యింది
– ప్రధాని తెలంగాణ పర్యటనలో..
– బ్యారేజ్ ను పరిశీలించాలి
– రేవంత్ రెడ్డి డిమాండ్

అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) ఆలోచనలు మారి.. ఆశలు పెరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని ఆరోపించారు. అవినీతి వాసననే తనకు పడదని చెబుతున్న ప్రధాని మోడీ (PM Modi) కాళేశ్వరం (Kaleswaram) కంపును ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

revanth-reddy-sensational-comments-on-cm-kcr

కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ (Medigadda) బ్యారేజ్ కుంగిపోయిందని అన్నారు రేవంత్. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పిన ఆయన.. ఇవాళ బ్యారేజ్ కుంగిపోగానే ఆ తప్పును నిపుణుల మీదకు తోసి సమస్యను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు మేడిగడ్డకు వెళ్లి పరిశీలించాలన్నారు. కేంద్రం అర్ధాంతరంగా ఒక నివేదిక ఇచ్చి వదిలేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ వ్యవహారంపై కేంద్రం తరఫున ఎవరూ మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి నుంచి బీజేపీ.. బీఆర్ఎస్ ​కు ప్రొటెక్షన్​ మనీ ఇస్తోందని.. అందుకే, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

మేడిగడ్డ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయట పెట్టిందని వ్యాఖ్యానించారు రేవంత్. 6 నెలల్లో కాంట్రాక్ట్ సంస్థ వారెంటీ పూర్తవుతుందని.. కేంద్ర కమిటీ అడిగిన అంశాల్లో తొమ్మిదింటికి వివరాలు ఇవ్వాలని అన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాచారం ఇవ్వడం లేదని.. ఈ అంశంపై కేంద్రం కలగజేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరంగా మార్చారని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి ఎలా అయిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. కమీషన్లు దోచుకోవడానికి కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ చేశారని అన్నారు రేవంత్. తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కోదండరాం గురించి, ఆయన చిత్తశుద్ధి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ సమాజం చెప్పుతో కొడతుందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి.

You may also like

Leave a Comment