తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) పాకిస్థాన్, ఇండియా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ని తలపించేలా ఉన్నాయంటున్నారు జనం.. కాంగ్రెస్ (Congress) ఓటమికి బీఆర్ఎస్ (BRS) చెమట చిందెలా కష్టపడుతుండగా.. కాంగ్రెస్ కూడా భిన్నంగా ప్రచారాలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ ను ఇంటికి పంపాలనే పట్టుతో ఉన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు.
మరోవైపు గెలుపు ఓటములు కాంగ్రెస్.. బీఆర్ఎస్ మధ్య దోబూచులాడుతుందని ఇప్పటికే ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా కేసీఆర్ తన హయాంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గాంధీభవన్ లో ‘బై బై కేసీఆర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో కేసీఆర్ అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. కారును అలంకరించి దానిపై ‘బై-బై కేసీఆర్’ అంటూ రాసి ప్రచారం మొదలు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు..
పదేండ్ల అహంకారంపై తిరగబడుదాం.. పదేండ్ల పంక్చర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం.. అని కారు వెనుక భాగంలో రాసి ఉంచారు. అంతేకాదు.. కేసీఆర్ తెలంగాణను ముంచిండు.. 5 లక్షల కోట్లు అప్పును మోపిండు అని రాసి ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఈ ప్రచారం ఓటర్ల మైండ్ లోకి వెళ్ళితే కాంగ్రెస్ విజయం పక్కా అని హస్తం కార్యకర్తలు సంబరపడుతున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీలు సోషల్ మీడియానూ బాగా ఉపయోగించుకుంటున్నాయి.. జనాల్లోకి వెళ్లేందుకు, ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. కాగా బీజేపీ పెద్దగా హంగామా చేయడం లేదని, ఈ రెండు పార్టీలు మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నాయని జనం అనుకుంటున్నారు..