Telugu News » My Village Show: కోడి కూర వండిన కేటీఆర్…. నెటిజన్లు ఫిదా….!

My Village Show: కోడి కూర వండిన కేటీఆర్…. నెటిజన్లు ఫిదా….!

ముఖ్యంగా ఈ ఛానెల్‌లో గంగవ్వ (Gangavva) యాక్టింగ్, ఆమె తెలంగాణ యాసకు అందరూ ఫిదా అయి పోయారు.

by Ramu

మై విలేజ్ షో (My Village Show)…. ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న వీడియోలు చేస్తూ అతి తక్కువ కాలంలో మంచి ఫేమస్ యూట్యూబ్ ఛానల్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఈ ఛానెల్‌లో గంగవ్వ (Gangavva) యాక్టింగ్, ఆమె తెలంగాణ యాసకు అందరూ ఫిదా అయ్యారు.

అనిల్ గీల, అంజిమామలు ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇటీవల పలువురు ప్రముఖులను గంగవ్వ ఇంటర్వ్యూలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో గంగవ్వ టీమ్ తో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. రొటీన్ టీవీ ఇంటర్వ్యూలాగా కాకుండా ఈ కార్యక్రమం చాలా సరదగా నడిచింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పొలాల మధ్యలో సరదగా గడిపారు. గంగవ్వ టీమ్ తో కలిసి మంచి నాటు కోడి కూర వండారు. నల భీమ పాకాన్ని తలదన్నెలా ఆయన వంట చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పుడు ప్రతిపక్షాలపై కారాలు, మిరియాలు నూరే కేటీఆర్ ఈ సారి కూరలో కారం వేస్తు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కొందరు అంటున్నారు. మరి కొందరు వెరైటీ ప్రచారంలో కేటీఆర్ కు సాటి ఎవరూ లేరని అంటున్నారు. ఇంకొందరైతే జై కేటీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment