Telugu News » Most Polluted Cities: వామ్మో ఇంత కాలుష్యమా… ప్రపంచంలో టాప్-10లో మన కాలుష్య నగరాలు…!

Most Polluted Cities: వామ్మో ఇంత కాలుష్యమా… ప్రపంచంలో టాప్-10లో మన కాలుష్య నగరాలు…!

తాజాగా ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం గల నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

by Ramu

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం గల నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పాటు కోల్‌కతా, ముంబై నగరాలు కూడా ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో ఉండటం భయాందోళనలను కలిగిస్తోంది.

పలు నగరాల్లో వాయు నాణ్యత సూచీల ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం గల నగరాల జాబితాను స్విస్ గ్రూపునకు చెందిన ఐక్యూఎయిర్ విడుదల చేసింది. ఆ జాబితాలో 483 ఏక్యూఐతో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్యం గల నగరంగా ఢిల్లీ నిలిచింది.

ఆ తర్వాత స్థానంలో 371 ఏక్యూఐతో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో రెండవ స్థానంలో ఉంది. ఇక 206 ఏక్యూఐతో కోల్ కతా మూడవ స్థానంలో ఉంది. 189 ఏక్యూఐతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం నాల్గవ స్థానంలో ఉన్నట్టు స్విప్ గ్రూపు పేర్కొంది. 162 ఏక్యూఐతో కరాచీ ఐదవ స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది.

162 ఏక్యూఐతో ఆరవ స్థానంలో ముంబై, 159 ఏక్యూఐతో చైనాలోని షెన్యాంగ్ ఏడవ స్థానం, 159 ఏక్యూఐతో చైనాలోని హంగ్జూ ఎనిమిదవ స్థానం, 155 ఏక్యూఐతో కువైట్ లోని కువైట్ నగరం తొమ్మిదవ, 152 ఏక్యూఐతో చైనాలోని వూహాన్ నగరం పదవ స్థానంలో ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

You may also like

Leave a Comment