మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) గన్‌మెన్ ఫాజిల్(Gun men) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో మణికంఠ హోటల్లో సూసైడ్ చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో నుదిటిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గన్‌మెన్ సూసైడ్ గురించి తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫాజిల్ ఎస్కార్ట్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
లోన్ రికవరీ వేధింపులు భరించలేక ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం కూతురితో కలిసి డ్యూటీకి వచ్చిన ఫాజిల్.. తన కూతురు కళ్ల ముందే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఫాజిల్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా? లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.