Telugu News » Israel-Hamas War:  అణుబాంబు ప్ర‌యోగానికైనా సిద్ధం.. ఇజ్రాయెల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!!

Israel-Hamas War:  అణుబాంబు ప్ర‌యోగానికైనా సిద్ధం.. ఇజ్రాయెల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!!

గాజాపై అణుబాంబును ప్ర‌యోగించేందుకైనా సిద్ధమని ఇజ్రాయెల్ మంత్రి అమిహై ఎలియ‌హు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్ (Israel-Hamas War) నెల‌రోజుల‌కు చేరుకోగా గాజాపై ఇజ్రాయెల్ భీక‌ర దాడులు కొన‌సాగుతున్నాయి.

by Mano
Israel-Hamas War: Prepare for Nuclear Bomb Test.. Israel Movement Announcement..!!

భీకర యుద్ధంతో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు దిక్కులేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని భయంతో వణికిపోతోన్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Israel-Hamas War: Prepare for Nuclear Bomb Test.. Israel Movement Announcement..!!

గాజాపై అణుబాంబును ప్ర‌యోగించేందుకైనా సిద్ధమని ఇజ్రాయెల్ మంత్రి అమిహై ఎలియ‌హు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌-హ‌మాస్ వార్ (Israel-Hamas War) నెల‌రోజుల‌కు చేరుకోగా గాజాపై ఇజ్రాయెల్ భీక‌ర దాడులు కొన‌సాగుతున్నాయి. మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ ల‌క్ష్యంగా గాజాపై వైమానిక‌, భూత‌ల దాడులను ఇజ్రాయెల్ ముమ్మ‌రం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అమిహై ఎలియహు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

గాజాలోని మ‌ఘ‌జి క్యాంప్‌పై శ‌నివారం రాత్రి ఇజ్రాయెల్ చేప‌ట్టిన దాడుల్లో మ‌హిళలు, చిన్నారులు స‌హా 38 మంది పాల‌స్తీనీయులు మ‌ర‌ణించార‌ని పాల‌స్తీనా అధికారులు వెల్ల‌డించారు. గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అవ‌కాశాల‌ను కూడా ఇజ్రాయెల్ ప‌రిశీలిస్తుంద‌ని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియ‌హు ప్ర‌క‌టించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్ర‌త‌రం కావ‌డంతో అణు బాంబును ప్ర‌యోగించే అవ‌కాశం ఉందా అన్న ప్ర‌శ్న‌కు మంత్రి బ‌దులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అణుబాంబు ప్రయోగం విషయమై ఇజ్రాయెల్ ప‌రిశీలిస్తోంద‌ని, యుద్ధ నిర్ణ‌యాల‌ను తీసుకునేందుకు ఏర్పాటైన కేబినెట్ భ‌ద్ర‌తా క‌మిటీలో తాను స‌భ్యుడిని కాద‌ని ఆయన వెల్లడించారు. అయితే గాజాపై అణుబాంబును ప్ర‌యోగించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రోవైపు గాజాపై భూత‌ల దాడులు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 2500 హ‌మాస్ టార్గెట్స్‌ను ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింద‌ని ఐడీఎఫ్ వెల్ల‌డించింది.

You may also like

Leave a Comment