Telugu News » VarunLav: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. మెరిసిపోతున్న ముచ్చటైన జంట..!!

VarunLav: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. మెరిసిపోతున్న ముచ్చటైన జంట..!!

ఈ వేడుక సోమవారం(నేడు) మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో గ్రాండ్‌గా జరుగుతోంది. ఈవేడుకకు పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేశారు.

by Mano
VarunLav: Grand Varun Tej-Lavanya Tripathi reception.. Sparkling cute couple..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varuntej)-లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ల రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి పెళ్లి నవంబర్ 1న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కడికి కుటుంబసభ్యులు, కొందరు అత్మీయులను తప్ప సినీ ఇండస్ట్రీని మెగా కుటుంబం పిలవలేదు. దీంతో హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

VarunLav: Grand Varun Tej-Lavanya Tripathi reception.. Sparkling cute couple..!!

ఈ వేడుక మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఇక ఈ రిసెప్షన్‌లో వరుణ్, లావణ్య ప్రత్యేక ఆకర్శణతో కనిపించారు. వరుణ్ తేజ్.. బ్లాక్ కలర్‌పై గోల్డ్ కలర్ ఫ్లోరల్ వర్క్ షేర్వాణీలో, లావణ్య.. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోయారు. ముఖ్యంగా లావణ్య చీరకట్టు.. మెడలో రవ్వలహారంలో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది.

సాధారణంగా సెలబ్రిటీస్ పెళ్ళికి చీర కట్టుకున్నా రిసెప్షన్‌కు డిజైనర్ డ్రెస్‌లతో కనిపిస్తారు. కానీ లావణ్య అందుకు భిన్నంగా నిండైన చీరకట్టుతో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘చూడ ముచ్చటగా ఉన్నారు’.. ‘ ఈ జంట కలకాలం కలిసి ఉండాలి..’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలకు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెగా కోడలిని చూసి మెగా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.

ఈవేడుకకు పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్, జయసుధ, జగపతిబాబు, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ముత్యాల సుబ్బయ్య, బోయపాటి శ్రీనివాస్, సుకుమార్, నాగచైతన్య, సునీల్, అలీ, పురందేశ్వరి, బెల్లంకొండ శ్రీనివాస్, గుణశేఖర్, బెల్లంకొండ సురేష్, బన్నీవాసు, వెంకీ అల్లూరి, చోటా కే నాయుడు తదితర టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నిర్మాతలు రిసెప్షన్‌కు హాజరయ్యారు.

MEGA

You may also like

Leave a Comment