Telugu News » Pandem Kollu: పందెంకోళ్లకు దొంగల బెడద.. పోలీసులు ఏం చెప్పారంటే..!

Pandem Kollu: పందెంకోళ్లకు దొంగల బెడద.. పోలీసులు ఏం చెప్పారంటే..!

పందెం కోళ్లను పెంచే పెంపకం దారులకు ఇప్పుడు కంటిమీదకునుకు లేకుండా పోయింది. దానికి కారణం ఇటీవల పందెం కోళ్ల దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయట.

by Mano
Pandem kollu

సంక్రాంతి పండుగ(Sankranthi Festival) అంటే చాలు.. గొబ్బెమ్మలు.. రంగురంగుల ముగ్గులు.. పతంగులు.. కోళ్ల పందాలు గుర్తొస్తాయి కదా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఏటా సంక్రాంతి పండుగకు ఏపీలోని గోదావరి జిల్లా(Godavari Dist) లో పెద్దఎత్తున కోళ్లపందాలు(Kolla Pandalu) జరుగుతాయి. పండుగ మూడు రోజుల పాటు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతాయి.

Pandem kollu

సంక్రాంతి పండుగకు రెండు మూడు నెలల ముందు నుంచే గోదావరిజిల్లాలో రకరకాల పందెం కోళ్లను కొందరు ప్రత్యేకంగా పెంచుతారు. అయితే ఆ కోళ్లను పెంచే పెంపకం దారులకు ఇప్పుడు కంటిమీదకునుకు లేకుండా పోయింది. దానికి కారణం ఇటీవల పందెం కోళ్ల దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయట.

పందాల కోసం పోటీ పడే పందెం కోళ్లు వేలల్లోనే కాదు.. లక్షల రూపాయలు పలుకుతాయి. ఒక జాతి పందెంకోడి పెంపకానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుంది. అలా పెంచిన  కోడి పుంజులను వాటి రంగు, పోరాట పటిమ, ఎత్తు చూసి 50 వేల నుంచి 5 లక్షల వరకు వాటిని అమ్ముతారు. అయితే ప్రస్తుతం ఈ పందెం కోళ్లు పెంచుతున్న పెంపకం దారులు మాత్రం దొంగల బెడదతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఎంతో కష్టపడి పెంచిన పుంజులను నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లిపోతుండటంతో పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. నూజివీడు మండలం రావిచర్లకు చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు దంపతులను దొంగలు కత్తితో బెదిరించి కోళ్ల ఫాంలో పెంచుతున్న రూ.4లక్షలు విలువ చేసే పందెం పుంజులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దొంగల బెడద లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

You may also like

Leave a Comment