Telugu News » Pawan Khera: తెలంగాణ ఆత్మహత్యలకు క్యాపిటల్‌గా మారింది: పవన్ ఖేరా

Pawan Khera: తెలంగాణ ఆత్మహత్యలకు క్యాపిటల్‌గా మారింది: పవన్ ఖేరా

సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాలతో పోలిస్తే నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. చీటింగ్.. కరప్టన్ ప్రభుత్వం అంటూ సెటైర్లు విసిరారు.

by Mano
Pawan Khera: Telangana has become the capital of suicides: Pawan Khera

బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో తెలంగాణ ఆత్మహత్యల క్యాపిటల్‌గా మారిందని సీబ్ల్యూసీ(cwc) సభ్యుడు పవన్ ఖేరా(Pawan Khera) అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాలతో పోలిస్తే నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. చీటింగ్.. కరప్టన్ ప్రభుత్వం అంటూ సెటైర్లు విసిరారు.

Pawan Khera: Telangana has become the capital of suicides: Pawan Khera

గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని పవన్ ఖేరా మండిపడ్డారు. యువత ఎందుకు ఆక్రోశంతో ఉన్నారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సమస్యలకు పరిష్కారం నవంబర్ 30 జరిగే ఎన్నికలే నిదర్శనని అన్నారు. ప్రజల్లో ఆవేశం.. ఎవరికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మితే మిమ్మిల్ని దోచుకుంటారని పవన్ భేరా వెల్లడించారు.

బీఆర్ఎస్‌ యువతను ఘోరంగా మోసం చేసిందని, తెలంగాణ నిరుద్యోగంలో 15శాతం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ నిరుద్యోగంలో నెంబర్ వన్.. 200 కోట్లు పరీక్ష ఫీజు పేరుతో వసూలు చేశారు కానీ.. పరీక్షలు లేవు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. 2021నుంచి ఇప్పటికి 567 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

యువత తమ కోపాన్ని నవంబర్ 30న ఓటురూపంలో తెలపాలని పిలుపునిచ్చారు పవన్ భేరా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ‘ సెల్‌ఫోన్‌ కొంటేనే గ్యారంటీ ఉందా? లేదా? అని చూస్తాం.. అలాగే ఎన్నికల్లో ప్రజలు గ్యారంటీలను అడగాలి’ అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.

You may also like

Leave a Comment