Telugu News » Diwali Bumper Offer : దీపావళికి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం.. !!

Diwali Bumper Offer : దీపావళికి బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం.. !!

ఈ అమ్మకాలు విజయవంతంగా కొనసాగితే.. దేశవ్యాప్తంగా భారత్‌ ఆటా అమ్మకాలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 60 రూపాయలకే శనగపప్పు, 25 రూపాయలకే ఉల్లిపాయలు అందిచనున్నట్టు తెలిపారు.

by Venu

రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యుడు చితికి పోతున్నాడు. ధరల పెరుగుదల విషయంలో ప్రజలు ప్రభుత్వాల పై విమర్శలు చేస్తున్న ధరలు అదుపులో ఉండటం లేదన్న విషయం తెలిసిందే.. ఇక పండగలు వస్తే షాపింగ్ మాల్స్ అన్ని ఆఫర్లతో నిండిపోతాయి. అయితే ఈ దీపావళి పండగకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

దీపావళి పండగ (Diwali festival) సందర్భంగా కిలో గోధుమ పిండిని (Wheat flour) రూ.27.50కి అందించే పథకాన్ని ప్రారంభించింది. ‘భారత్‌ ఆటా’ (Bharat Atta)పేరుతో మొబైల్​ వాహనాల ద్వారా గోధుమ పిండి విక్రయించడానికి సిద్దం అయ్యింది. ఈ నిర్ణయంతో అధిక ధరల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని కేంద్రం తెలిపింది. మరోవైపు కేంద్ర సహకార సంస్థలైన NAFED, NCCF, కేంద్రీయ బండార్‌ల సహాయంతో, సహకార సంస్థలకు ఉన్న 2000 కేంద్రాల్లో.. భారత్‌ ఆటా.. 800 మొబైల్ వ్యాన్లు ద్వారా అమ్మకాలు జరుపుతామని పేర్కొంది.

ఈ అమ్మకాలు విజయవంతంగా కొనసాగితే.. దేశవ్యాప్తంగా భారత్‌ ఆటా అమ్మకాలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 60 రూపాయలకే శనగపప్పు, 25 రూపాయలకే ఉల్లిపాయలు అందిచనున్నట్టు తెలిపారు. కాగా ఈ విషయం తెలిసిన సామాన్యుడు సబ్సిడీలు ఇచ్చే బదులుగా సరకుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment