Telugu News » ALERT: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు..!

ALERT: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు..!

ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను కేటాయించినట్లు తెలిపారు.

by Mano
ALERT: Traffic restrictions in the city.. Do not go on those routes..!

బీజేపీ(BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions)  విధించారు. ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో ప్రధాని సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పలు రూట్లలో వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ALERT: Traffic restrictions in the city.. Do not go on those routes..!

ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా అబిడ్స్‌, నాంపల్లి, రవీంద్రభారతి, ట్యాంక్‌బండ్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.

వీఐపీల వాహనాలు టెన్నిస్‌ కోర్టు వద్ద, మీడియా వాహనాలు నిజాం కళాశాల గేటు-1 వద్ద దిగి మహబూబియా కాలేజీలో పార్కు చేసుకోవాలని సూచించారు. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా మెహిదీపట్నం నుంచి నిరంకారి, పాత సైఫాబాద్‌, ఇక్బాల్‌ మీదుగా వచ్చే వాహనాలు మినార్‌, రవీంద్రభారతి, హెచ్‌టీపీ జంక్షన్‌, పబ్లిక్‌ గార్డెన్‌ లోపల వాహనాలు పార్కు చేసుకోవాలి. సికింద్రాబాద్‌, ట్యాంక్‌బండ్‌, అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా వచ్చే అన్ని వాహనాలు లిబర్టీ, బషీర్‌బాగ్‌, ఆయకార్‌ భవన్‌ వద్ద దిగి వాహనాలు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద పార్క్‌ చేయాలని సూచించారు.

 

You may also like

Leave a Comment