Telugu News » Mlc Kavitha: రష్మిక ఫేక్ వీడియో.. అగ్ర నటులు ఏం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha: రష్మిక ఫేక్ వీడియో.. అగ్ర నటులు ఏం చేస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

by Mano
Mlc Kavitha: Rashmika fake video.. What are top actors doing: Mlc Kavitha

హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika mandanna) డీప్ ఫేక్ వీడియో(Deep fake video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)తో ఆ ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సాంకేతికత దుర్వినియోగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. ఇంత జరుగుతున్నా సినీ ఇండస్ట్రీలో అగ్ర నటలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Mlc Kavitha: Rashmika fake video.. What are top actors doing: Mlc Kavitha

రక్షణ చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను x(ట్విట్టర్) ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలపై తగిన చర్యలకు పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి అని కవిత అభిప్రాయపడ్డారు. ఇలాంటి ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

డీప్ ఫేక్ వీడియోకు స్పందిస్తూ రష్మికకు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ వీడియోపై స్పందిస్తూ ఇలా చేసేవాళ్ల మీద చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. ట్విట్టర్(X) వేదికగా రష్మికగా అండగా ఉంటామని చెప్పారు.

‘సాంకేతిక పెరుగుతున్న కొద్దీ దాన్ని మంచి పనులకు కాకుండా కొంతమంది అది దుర్వినియోగం చేయాలని చూస్తున్నారు. అయితే అది మనుషుల మీద, మహిళలపై చేయడం సహేతుకం కాదు..’ అంటూ రష్మికకు తన మద్దతు తెలిపారు. ఆందోళన వ్యక్తం చేస్తూ, సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి అని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో అగ్రనటులు ఎవరూ స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment