ఐసీసీ(ICC) ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) పేరుతో ప్రతీనెల అవార్డులను బహూకరిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ నెలలో ఈ అవార్డుకు టీమిండియా(Team India) నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు రేసులో ఉన్నారు. ఇప్పటికే సెప్టెంబర్ నెలకు శుభ్‌మన్ గిల్(Shubaman Gill) కు ఈ అవార్డు వరించింది.
ఇప్పుడు అక్టోబర్ నెలకు ఈ అవార్డు రేసులో ముగ్గురు స్టార్ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో టీమిండియా స్పీడ్ బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) ఉండడం విశేషం. బుమ్రాతో పాటు సౌత్ ఆఫ్రికాకు చెందిన డి కాక్, న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ఈ రేసులో పోటీ పడుతున్నారు. అక్టోబర్‌లోనే వరల్డ్ కప్ స్టార్ట్ అవడంతో ముగ్గురూ ఆ నెలకు గాను బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించారు.
ఇండియా తరపున బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు వరిస్తే వరుసగా రెండు నెలలు టీమిండియాకే ఈ ఘనత దక్కినట్లు అవుతుంది. డి కాక్ మరియు రవీంద్ర లు కూడా ఆసాధారణమైన ప్రదర్శన చేశారు. మరోవైపు కానీ మొదటి సారి వరల్డ్ కప్ ఆడిన రవీంద్ర బ్యాటింగ్‌లో అద్బుతమగా రాణించిడంతో అతనికే ఈ అవార్డు దక్కుతుందని పలువురు అంటున్నారు.
డికాక్ ఇప్పటి వరకు 431 పరుగులు సాధించాడు. అదేవిధంగా న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 406 పరుగులు తీశారు. ఇండియా స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి రేస్‌లో ఉన్నాడు. మరి వీరి ముగ్గురిలో ఎవరికి ఈ అవార్డు దక్కుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.