Telugu News » Odisha : పాపం నిండు గర్భిణీ.. పురిటి నొప్పులతో..!!

Odisha : పాపం నిండు గర్భిణీ.. పురిటి నొప్పులతో..!!

ఒడిస్సాలోని నలచువాన్ గ్రామంలో శుక్రి జానీ (30) అనే గర్భిణీకి ఉదయం సమయంలో పురిటి నొప్పులు మొదలైయ్యాయి. వెంటనే గ్రామస్థులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గర్భిణీ కోసం వచ్చిన అంబులెన్స్ వారున్న చోటుకి వెళ్లలేక పోయింది.

by Venu

ఒడిస్సా (Odisha) రాష్ట్రం, కలహండి (Kalahandi) జిల్లాలో గిరిజనుల (Tribals) కష్టాలకు అద్దంపడుతున్న సంఘటన జరిగింది. జయపట్న బ్లాక్‌, ధన్సులి పంచాయతీలో నిండు గర్భిణికి తీవ్రమైన అవస్థ ఎదురైంది. డెలివరీ (Delivery) కోసం హాస్పటల్ కి వెళ్ళడానికి సరైన సౌకర్యం లేక.. కర్రలతో కట్టిన మంచం మీద హాస్పిటల్ కు తీసుకు వెళ్ళే క్రమంలో మార్గమధ్యంలో పురుడు పోసుకుంది. ఆ వివరాలు చూస్తే..

 

ఒడిస్సాలోని నలచువాన్ గ్రామంలో శుక్రి జానీ (30) అనే గర్భిణీకి ఉదయం సమయంలో పురిటి నొప్పులు మొదలైయ్యాయి. వెంటనే గ్రామస్థులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గర్భిణీ కోసం వచ్చిన అంబులెన్స్ వారున్న చోటుకి వెళ్లలేక పోయింది. ఆ గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిపి వేశారు సిబ్బంది.

ఈ క్రమంలో ఆ యువతికి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో చేసేదేమిలేక ఆ యువతి భర్త గ్రామస్థులతో కలిసి ఆమెని మంచంలో పడుకోబెట్టి అంబులెన్సు వరకు తీసుకువెళ్లేందుకు సిద్దం అయ్యారు. అలా వెళ్తున్న సమయంలో ఆ యువతి మార్గమధ్యంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారు అంబులెన్స్ వరకు చేరుకోగా.. తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి గమనించిన వైద్య సిబ్బంది.. వారు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు.

మరోవైపు ఈ గ్రామానికి నిధులు మంజూరు అయ్యిన వాటిని స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకవర్గం కాజేసినట్టు ఇక్కడి ప్రజలు ఆరోపించారు.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని.. కాని అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment