Telugu News » PM Modi : ఎవ్వర్నీ వదలం.. తప్పు చేస్తే జైలు పక్కా!

PM Modi : ఎవ్వర్నీ వదలం.. తప్పు చేస్తే జైలు పక్కా!

బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్నాయని, ఈ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని మండిపడ్డారు ప్రధాని. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తోందని... అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.

by Ramu

– 5 తరాల భవిష్యత్తును కాంగ్రెస్..
– 2 తరాల భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేశాయి
– బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే
– ఈ మూడూ కుటుంబ పార్టీలే
– కేసీఆర్‌ కు ప్రజల కంటే కుటుంబమే ముఖ్యం
– కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సీ టీమ్
– గులాబీ లీడర్లలో అహంకారం ఎక్కువైంది
– ఈ అహంకార సీఎంకు బీసీలు ఓటుతో బుద్ధి చెప్పాలి
– అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
– లిక్కర్ స్కామ్ లో కొందర్ని వదిలిపెట్టామంటున్నారు
– తప్పు చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తాం
– నిరుద్యోగులను నిండా ముంచారు
– టీఎస్పీఎస్సీని అక్రమాల పుట్టగా మార్చారు
– బీజేపీ గెలిస్తే.. బీసీలదే రాజ్యాధికారం
– బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీలకూ ప్రాధాన్యత ఇస్తున్నాం
– రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులు ఇచ్చాం
– పేదవాడి కడుపు ఖాళీగా ఉంచం
– కరోనా సమయంలో పొయ్యి ఆరకుండా చూశాం
– బీసీని ప్రధాని చేయాలన్న నిర్ణయం ఇక్కడే జరిగింది
– బీసీ సీఎం నిర్ణయం కూడా ఇక్కడే జరగాలి
– బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ

జన ధనాన్ని లూటీ చేసిన వాళ్ల సంగతి తేల్చుతామని ప్రధాని మోడీ (PM Modi) హెచ్చరించారు. హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ (BJP) బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొని ప్రసంగించారు. వ్యవస్థను బీఆర్ఎస్ (BRS) నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) వల్ల ఐదు తరాలు, కారు పార్టీ వల్ల రెండు తరాలు నాశనమయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒక్కటేనని.. మూడూ కుటుంబ పార్టీలంటూ విరుచుకుపడ్డారు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టమన్న మోడీ.. తన కుటుంబం దగ్గరకు వచ్చినట్టు ఉందని అన్నారు. 2013లో బీసీ లీడర్ అయిన తనను ప్రధాని చేయాలనే నిర్ణయం ఇక్కడే జరిగిందని.. 2023లో బీసీ సీఎం చేయాలని నిర్ణయం కూడా ఇక్కడే జరగాలన్నారు.
pm modi fire on brs and congress in bjp bc atmagorava sabhaతెలంగాణలో మార్పు దిశగా పరిణామాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజల విశ్వాసం బీజేపీ అని తెలిపారు. అన్ని వర్గాల్లోనూ మార్పు నిర్ణయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విరోధి అంటూ మండిపడ్డారు. నవంబర్ 30న ఈ విరోధి సర్కార్ ను విసిరి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిందని.. కానీ, ప్రజలను కేసీఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూఠీ చేసిందని.. కాంగ్రెస్ కు ఆ పార్టీ సీ టీమ్ అని ఫైర్ అయ్యారు. బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎందుకు సీఎం చేయదని ప్రశ్నించారు. బీజేపీ బీసీలు, ఆదివాసీలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మోడీ. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. ఇప్పుడు గిరిజన బిడ్డను చేశామన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ లు బీసీల గురించి ఆలోచించవని ఆరోపించారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారన్నారు. ఆ విరోధిని ఇంటికి పంపాల్సిన అసవరం ఉందని పిలుపునిచ్చారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీ మాత్రమేనన్న ఆయన… కేంద్ర కేబినెట్‌ లో 27 మంది ఉన్నారని వివరించారు. బీసీ వ్యక్తిని ప్రధానిని చేసి తనను గౌరవించారన్నారు. డెంటల్ కాలేజీల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని.. బీఆర్ఎస్ నేతలు అహంకారంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ అహంకార సీఎంకు ఓటులో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనధనాన్ని లూటీ చేసిన వాళ్ల సంగతి చెబుతామన్నారు. దానికి మోడీ గ్యారెంటీ అని చెప్పారు.

బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్నాయని, ఈ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని మండిపడ్డారు ప్రధాని. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తోందని… అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అవినీతి చేస్తే కచ్చితంగా జైల్లో వేస్తామని చెప్పారు. అవినీతిని అంతం చేయడంతో పాటు ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నారో వారిని వదిలిపెట్టేది లేదని, దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి రాబడుతామన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందని.. టీఎస్సీఎస్సీని అక్రమాల పుట్టగా మార్చారని మండిపడ్డారు. పేపర్ లీకులతో విద్యార్థుల భవిష్యత్ ఆగమైందన్నారు. మోసాల సర్కార్ పోవాలా వద్దా అని ప్రజలను అడిగారు ప్రధాని మోడీ.

 

You may also like

Leave a Comment