Telugu News » Priyanka Gandhi : ఖాళీ బొకేతో ప్రియాంక గాంధీకి ఆహ్వానం.. వైరల్ గా మారిన వీడియో..!!

Priyanka Gandhi : ఖాళీ బొకేతో ప్రియాంక గాంధీకి ఆహ్వానం.. వైరల్ గా మారిన వీడియో..!!

ఈ పువ్వులు లేని బొకే.. అచ్చం బీజేపీ (BJP) లీడర్లు ఇస్తున్న హామీల్లాగే ఉందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ సామాన్య ప్రజలను ఈ విధంగా మోసం చేస్తోందని తెలిపారు.

by Venu

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి ఓ అనుకొని సంఘటన ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌ లో ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక పైకి వెళ్ళిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.

అదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు పూలు లేని పుష్పగుచ్ఛాన్ని ప్రియాంక గాంధీకి అందించారు. అయితే ఆ బొకేలో పువ్వులు లేవు (Empty Bouquet) ఖాళీ బొకే చూసిన ప్రియాంక గాంధీ పువ్వులు ఏవీ అంటూ గట్టిగా నవ్వేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తున్న ప్రియాంక మధ్యలో పుష్ప గుచ్చం గురించి ప్రస్తావించారు.

ఈ సంఘటనని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పోల్చారు. ఈ పువ్వులు లేని బొకే.. అచ్చం బీజేపీ (BJP) లీడర్లు ఇస్తున్న హామీల్లాగే ఉందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ సామాన్య ప్రజలను ఈ విధంగా మోసం చేస్తోందని తెలిపారు. కాగా ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో కాంగ్రెస్ (Congress) షేర్ చేయడంతో అది తెగ వైరల్ గా మారింది.

You may also like

Leave a Comment