Telugu News » TTD: ఆ పని టీటీడీ ఎందుకు చేస్తుంది: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD: ఆ పని టీటీడీ ఎందుకు చేస్తుంది: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

అర్కాలజీ అధికారులతో కలిసి పార్వేటీ మండపం పరిశీలనకు వస్తానని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్(Bhanu prakash) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలను ఈవో ధర్మారెడ్డి తోసిపుచ్చారు.

by Mano
TTD: Why does TTD do that work: TTD Evo Dharma Reddy

తిరుమల(Tirumala)లోని పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharmareddy) స్పందించారు. ఆర్కాలజీ అధికారుల సూచనల మేరకు టీటీడీ జీర్ణోద్దారణ పనులు చేయాలని,  తేదీ, సమయం చెబితే అర్కాలజీ అధికారులతో కలిసి పార్వేటీ మండపం పరిశీలనకు వస్తానని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్(Bhanu prakash) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలను ఈవో ధర్మారెడ్డి తోసిపుచ్చారు.

TTD: Why does TTD do that work: TTD Evo Dharma Reddy

అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది? అని ధర్మారెడ్డి ప్రశ్నించారు. ‘ఏ వ్యక్తి అయితే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెప్తున్నారో మేము దాన్ని స్వీకరించాం.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వచ్చి మండపాలను నిర్మిస్తే తమ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. 2019 నుంచి సుమారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.

నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా? అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునఃనిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే, ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్తంభాలతో అదేవిధంగా నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు ఆర్కియాలజీ శాఖ అధికారికి లేఖ రాసినట్లు తెలిపారు. టీటీడీకీ సంబంధించి రెండు ఆలయాలు మాత్రమే తమ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అందులో ఒక్కటి శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయం రెండు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నట్లు తెలిపారు.

మరికొద్ది రోజుల్లో 2000 దేవాలయాలు పూర్తి అవుతాయని ధర్మారెడ్డి చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మండపాన్ని నిర్మించామని తెలిపారు. నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకూ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదు. నిరంతరాయంగా చిరుత, ఎలుగుబంటి సంచారంపై నిఘా ఉంచాం.. కాలిబాట మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.

You may also like

Leave a Comment