తెలంగాణలో (Telangana) ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఎన్నికలకు ఇంకా పట్టుమని 20 రోజుల సమయం కూడా లేదు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పై ఉత్కంఠ ప్రజల్లో కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈసారి గెలిచేందుకు ప్రధాన పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో గల్లంతు అవుతుందని అంతా భావించిన కాంగ్రెస్ (Congress) ఒక్కసారిగా పుంజుకోవడంతో ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లోకి క్యూ కట్టడం మొదలు పెట్టారు దాంతో ప్రజల్లో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది..
అలా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండడం బీఆర్‌ఎస్ (BRS)కు కంటిమీద కునుకులేకుండా చేస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ (CWC Member) సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid).. బీఆర్‌ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఆగమేఘాల మీద నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక సామాన్యుడి ఇంటిని త్వరగా ఎందుకు నిర్మించి లేక పోతున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ 5.72 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, ఇచ్చిన హామీ మరచి పదవుల కోసం పాకులాడుతుందని సల్మాన్ ఖుర్షీద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కంటే.. క్వాలిటీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన కేసీఆర్ (KCR)..రెండుసార్లు అధికారం చేపట్టి ఎన్ని ఇళ్లు పంపకం చేశారో చెప్పాలన్నారు. నాణ్యత లేని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి రాష్ట్రాన్ని బాగుచేసినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని సల్మాన్ ఖుర్షీద్ ఆగ్రహించారు.
బీఆర్‌ఎస్ పాలనలో అడుగడుగున అవినీతి కనపడుతుందని సల్మాన్ ఖుర్షీద్ ఆరోపణలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు. ఇక రాజకీయం అనేది వైకుంఠపాళి.. ఓసారి అందనత్త ఎత్తుకు తీసుకెళ్తుంది. మరోసారి అధఃపాతాళానికి నెట్టేస్తుంది.. ఎత్తులో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం మరచిపోతే అధఃపాతాళం గతి అవుతుందన్న సల్మాన్.. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పరిస్ధితి కూడా ఇంతే అని పేర్కొన్నారు..
పూర్తి కథనం..