Telugu News » Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ డ్రామాలు.. సంచలన నిజాలు బయట పెట్టిన సీబీఐ మాజీ డైరెక్టర్..!!

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ డ్రామాలు.. సంచలన నిజాలు బయట పెట్టిన సీబీఐ మాజీ డైరెక్టర్..!!

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం లేకుండా సీబీఐ విచారణ జరపొచ్చని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) అనుమతి అవసరం లేదని కిషన్‌రెడ్డికి సూచించారు. అంతేకాదు ఈ విషయంలో సీబీఐకి ఎవరి అనుమతి అవసరం లేదన్న నాగేశ్వరరావు.. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్టు అనుమానం వస్తే డైరెక్ట్ గా కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని అన్నారు.

by Venu

కాళేశ్వరం ప్రాజెక్ట్.. ఈ పేరు తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిందని జనం అనుకుంటున్నారు. కాళేశ్వరం కట్టడంలో జరిగిన అవినీతి పై ఇప్పటికే కాంగ్రెస్ పోరాటం చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఎరువులపై కొట్టే మందులా అప్పుడప్పుడు విమర్శలని చిలకరిస్తుందని ఎద్దేవా చేస్తున్నారు రాష్ట్ర జనం.. అవినీతిని అంతం చేయాలంటే ఒకరి పర్మిషన్ అవసరం లేదని, తగిన ఋజువులు ఉంటే చాలన్న విషయం అందరికీ తెలుసు.. మరి బీజేపీ కళ్ళకు బీఆర్ఎస్ చేస్తున్న స్కామ్ లు కనపడటం లేదా ? అని కామన్ మ్యాన్ తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు.

మరోవైపు కాళేశ్వరం అవినీతి పై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Chief Kishan Reddy)..తాజాగా సీఎం కేసీఆర్‌ (CM KCR) అంగీకరిస్తే రెండు గంటల్లో కాళేశ్వరం (Kaleshwaram) అవినీతి పై సీబీఐ (CBI) విచారణ జరుపుతుందంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రకటనపై సీబీఐ మాజీ డైరెక్టర్( (Former CBI Director) నాగేశ్వరరావు (Nageswara Rao) స్పందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరం లేకుండా సీబీఐ విచారణ జరపొచ్చని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) అనుమతి అవసరం లేదని కిషన్‌రెడ్డికి సూచించారు. అంతేకాదు ఈ విషయంలో సీబీఐకి ఎవరి అనుమతి అవసరం లేదన్న నాగేశ్వరరావు.. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగినట్టు అనుమానం వస్తే డైరెక్ట్ గా కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని అన్నారు.

మరోవైపు కాళేశ్వరానికి అనుమతులిచ్చింది కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే అని వెల్లడించారు. అందువల్ల కేంద్రం కూడా సీబీఐ విచారణ కోరవచ్చని మాజీ డైరెక్టర్ తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీబీఐ విచారణలో నిందితులుగా తేలితే మాత్రం అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసిన అవసరం ఉంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు.. ఇక ఈయన వివరణ చూసిన జనం కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ డ్రామాలు ఆడుతుందని అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment