ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. నేతల ఆస్తులు పెరుగుతూ ఉంటాయి.. కానీ సామాన్యుడు మాత్రం ఇంకా పేదవాడిగా మారుతాడని నేటి సమాజం అంటుంది. రాజకీయాలు అంటే సకల వైభోగాలకు కేరాఫ్ గా భావిస్తున్న నేతలు.. పదవి లేకుంటే ప్రాణం పోయినట్టుగా భావిస్తున్నంత కాలం.. రాజకీయాన్ని ప్రజాసేవగా గుర్తించలేనంత కాలం.. మా బ్రతుకులు మారయని భావించిన జనం అంతా కలిసి గొప్ప పని చేశారు.. కర్ణాటక జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే..
కర్ణాటక (Karnataka) బాగల్‌కోట్ (Bagalkot) జిల్లా కంకన్‌వాడి (Kankanwadi) గ్రామంలో జనం సుమారుగా రూ.24 లక్షల వరకు చందాలు వేసుకొని కర్రల వంతెన (Sticks Bridge) నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో దాదాపు 300 మంది జనాభా ఉంటారని అంటూన్న స్థానికులు.. తమ వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు అవసరమైన వంతెన లేక నానా అవస్థలు పడ్డామని తెలిపారు.
ఆ వంతెన కోసం ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పాలకులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన గ్రామస్థులు, రైతులు.. చందాలు వేసుకొని నిర్మించుకున్న కర్రల వంతెనను ఓ మంత్రితో ఆవిష్కరింపజేసి.. పాలకుల నిర్లక్ష్య వైఖరిని ప్రపంచానికి చాటారు. కాగా రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారినా.. ఎందరో నాయకులు మారినా.. గ్రామం పక్కన ఉండే కృష్ణా నది దాటడానికి వంతెన నిర్మించలేక పోయారని స్థానికులు మండిపడ్డారు.
మరోవైపు కృష్ణా నది ఆవలి వైపున గుహేశ్వర్ ద్వీపంలో నివసిస్తున్న గ్రామస్థులకు మొత్తం 800 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. కాగా నది దాటితే గానీ వారు తమ పొలాలకి వెళ్లలేని పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం కూడా అంత పెద్ద బ్రిడ్జి కట్టలేమని చేతులెత్తేసింది. కానీ నది దాటడానికి గ్రామస్థులకు ఓ మెకనైజ్డ్ బోటును మాత్రం ప్రభుత్వం అందించింది. అయితే ప్రతి సంవత్సరం ఆ బోట్ నిర్వహణ కోసం రూ.5-6 లక్షలు ఖర్చు అవుతుండటం.. ఆ ఖర్చు గ్రామస్థుల మీద పడటంతో విసిగిపోయాయారు..
దాంతో గ్రామ ప్రజలు బ్రిడ్జ్ కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. 30 మంది రైతులు మూడు నెలల్లో.. తాళ్లతో వంతెనను నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ వంతెన 800 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో నిర్మించుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరో వైపు మీరు గ్రామం కోసం చేసిన కృషి తెలుసుకున్న నెటిజన్లు.. పాలకులు, అధికారులు సిగ్గుపడేట్టు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.