ఆర్మూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్(KTR) కు తృటిలో ప్రమాదం తప్పింది. ర్యాలీగా నామినేషన్‌కు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు కేటీఆర్. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి(Mp Suresh reddy), ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(mla jeevan reddy) కూడా కింద పడిపోయారు.
ఈ ఘటనలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డిలకూ గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎన్నికల ప్రచారం మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రచార రథం నుంచి కేటీఆర్ పట్టుతప్పి కిందపడిపోయారు. ప్రచార రథం రెయిలింగ్ విరగడంతో కేటీఆర్ ముందుకు పడిపోయారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను గట్టిగా పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నేలపై పడిన ఎంపీ సురేష్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే స్వల్పగాయాలే కావడంతో కేటీఆర్.. జీవన్‌రెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.
ఈ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని కోరారు. ప్రమాదం తర్వాత కేటీఆర్.. కొడంగల్ పపర్యటనకు బయల్దేరి వెళ్లారు.