Telugu News » Kamareddy : హరర్ సినిమాను తలపిస్తున్న కామారెడ్డి రాజకీయాలు.. 34 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు లేకుండానే..!!

Kamareddy : హరర్ సినిమాను తలపిస్తున్న కామారెడ్డి రాజకీయాలు.. 34 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు లేకుండానే..!!

కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ.. ఇప్పటి వరకు ఎవరో ఒకరు లేదా ఇద్దరు బరిలో ఉంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం పోటీకి ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారు.. కాసేపు గెలుపు ఓటములను పక్కన పెడితే కామారెడ్డిలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆ ఇద్దరు నాయకులు ఈ ఎన్నికల్లో ప్రస్తుతం పోటీ చేయడం లేదు.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

కామారెడ్డిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఈ నియోజక వర్గంలో ఇద్దరు ప్రధాన పార్టీ నేతలు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు వైపుల ఉన్న నేతలు తమనే విజయం వరిస్తుందనే ధీమాలో ఉండగా.. ఇక్కడి ఓటర్లలో మాత్రం ఊహకందనంత ఆసక్తి.. చర్చగా మారిందని అనుకుంటున్నారు.

ఇక కామారెడ్డి నుంచి బీఆర్ఎస్‌ (BRS) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)..కాంగ్రెస్ ((Congress) నుంచి రేవంత్‌రెడ్డి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల రాష్ట్రంలో ప్రస్తుతం కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. అయితే 34 ఏళ్ల తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పోటీలో లేకుండా ఎన్నికలు జరుగుతుండటం విశేషం.

మరోవైపు కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ.. ఇప్పటి వరకు ఎవరో ఒకరు లేదా ఇద్దరు బరిలో ఉంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం పోటీకి ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారు.. కాసేపు గెలుపు ఓటములను పక్కన పెడితే కామారెడ్డిలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆ ఇద్దరు నాయకులు ఈ ఎన్నికల్లో ప్రస్తుతం పోటీ చేయడం లేదు.

మరోవైపు కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్‌ అలీ, గంప గోవర్ధన్ గత 29 సంవత్సరాలుగా పోటీపడుతూ ఉన్నారు. కాగా షబ్బీర్‌ అలీ 1989 ఎన్నికల్లో తొలి విజయం అందుకున్నారు. తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో గంప గోవర్ధన్ టీడీపీ నుంచి పోటీ చేసి.. షబ్బీర్‌ అలీపై భారీ మెజార్టీతో విజయం నమోదు చేశారు. ఇలా ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా నిలిచిన ఆ ఇద్దరిలో ఒక్కరూ కూడా కామారెడ్డి స్థానం నుంచి బరిలో లేకుండా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటం కామారెడ్డిలో చర్చలకు దారితీసింది.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా గంప గోవర్ధన్ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు (PCC President) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డి నుంచి బరిలో దిగడంతో నిజామాబాద్‌ నుంచి షబ్బీర్‌ అలీ (Shabbir Ali) పోటీ చేస్తున్నారు. ఇంతటి హర్రర్ సినిమాను తలపిస్తూ.. ఉత్కంఠ నెలకొన్న కామారెడ్డిలో ఎవరూ విజయం సాధిస్తారన్నది తెలియాలంటే రిజల్ట్ వరకు ఆగవలసిందే..

You may also like

Leave a Comment