Telugu News » Ponnam prabhakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చార్జిషీట్..!

Ponnam prabhakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చార్జిషీట్..!

హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చార్జిషీట్ విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.

by Mano
Ponnam Prabhakar: Congress candidate Ponnam Prabhakar charge sheet against BRS MLA..!

హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ చార్జిషీట్ విడుదల చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా ఉన్నా ఎమ్మెల్యే సతీష్ కుమార్ వ్యతిరేకంగా ఉండడం వల్లే ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదని ఆరోపించారు.

Ponnam Prabhakar: Congress candidate Ponnam Prabhakar charge sheet against BRS MLA..!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు లేదన్నారు. సమర్ధత, అసమర్ధతకు, బానిసత్వానికి, ఆశీర్వాదానికి హుస్నాబాద్‌లో పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. సెంటిమెంట్‌కు హుస్నాబాద్ ప్రజల కన్నీళ్లు గజ్వేల్, సిద్దిపేటకు మాత్రమే నీళ్లు అందిస్తున్నారని అన్నారు.

పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఒక్క విద్యాసంస్థనూ హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఐటీడీఏను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అసమర్థుడు అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో సాక్ష్యాలతో సహా మళ్లీ వివరిస్తామని వెల్లడించారు.

ఎమ్మెల్యే సతీష్ కుమార్ పదేళ్లు అయినా తన ఓటు హక్కును హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగపూర్ గ్రామంలో ఎందుకు ఉంచుకున్నారని,  హుస్నాబాద్‌కు ఎందుకు మార్చుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేను తాను వ్యక్తిగతంగా విమర్శించడం లేదన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అంటున్నామని చెప్పారు.

You may also like

Leave a Comment