Telugu News » Khammam : మతి తప్పిన పువ్వాడ.. అలా మాట్లాడటం సరికాదు..??

Khammam : మతి తప్పిన పువ్వాడ.. అలా మాట్లాడటం సరికాదు..??

ఖమ్మం నగరంలోని 9, 10వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తుమ్మల.. నేను డాలర్ లాంటోన్ని ఎక్కడైనా చెల్లుతా.. కానీ పువ్వాడ రద్దు చేసిన 2 వేల రూపాయల నోటు లాంటోడు.. చెల్లని నోటుకు ఎవరైనా విలువ ఇస్తారా అని ఎద్దేవా చేశారు.

by Venu
tummala

ఖమ్మం (Khammam)లో రాజకీయాలు (politics) గుంటూరు మిర్చి (Guntur Mirchi) ఘాటును మరిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ (Congress) మధ్య వార్ ఇక్కడి రాజకీయాలను ఆసక్తిగా మారుస్తున్నాయి. నిత్యం ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలకుంటే మనస్సు నిమ్మలం లేదని అనుకుంటున్నారు స్థానిక ప్రజలు..

మరోవైపు వాడిపోతున్న పువ్వు లాంటోడు పువ్వాడ అని తుమ్మల అంటే.. తుమ్మ చెట్టు ముళ్ళు లాంటోడు తుమ్మల అని పువ్వాడ అంటున్నారు.. ఇలా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)..మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

ఖమ్మం నగరంలోని 9, 10వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తుమ్మల.. నేను డాలర్ లాంటోన్ని ఎక్కడైనా చెల్లుతా.. కానీ పువ్వాడ రద్దు చేసిన 2 వేల రూపాయల నోటు లాంటోడు.. చెల్లని నోటుకు ఎవరైనా విలువ ఇస్తారా అని ఎద్దేవా చేశారు. ఇక మంత్రి పువ్వాడ కేసులు పెట్టించడంలో దిట్ట.. అలా జనాన్ని పీడించి, పిప్పిచేసి ఆస్తులు కూడబెట్టుకున్నాడాని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు.

అంతటి అవినీతి పరుడు పువ్వాడ నీతులు చెప్పడం చూస్తుంటే జనం నవ్వుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. పువ్వాడ మాటలు వింటే మతి తప్పిన వాడిలా ఉన్నాయన్న తుమ్మల.. తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు..

You may also like

Leave a Comment