మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా తెరదించుతామని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. మాదిగలు తమ హక్కుల (Rights) కోసం చేసే పోరాటాన్ని తాము గుర్తించామని చెప్పారు. వారి పోరాటం గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. అనేక మంది తమ హక్కుల కోసం దీర్ఘకాలికంగా చేసిన పోరాటం తమకు తెలుసన్నారు.
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ విషయంపై ఓ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ కమిటీ ద్వారా మాదిగలను సంఘటిత పరిచేందుకు ఓ కొత్త మార్గాన్ని ఏర్పరుస్తామని వెల్లడించారు. ఒక పెద్ద న్యాయపరమైన ప్రక్రియ ఇప్పుడు సుప్రీం కోర్టులో కొనసాగుతోందన్నారు. అ విషయం అందరికీ తెలుసన్నారు. మీ పోరాటం న్యాయపరమైందనిగా గుర్తిస్తామన్నారు.
వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తామని అభయమిచ్చారు. సామాజిక న్యాయానికి బీజేపీ గ్యారెంటీ ఇస్తోందన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు.
న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగం తమకు ఇచ్చిందన్నారు. తాము ఖచ్చితంగా మీ మార్గాన్ని సుగమం చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం పూర్తి పకడ్బందీతో, పూర్తి చితశుద్దితో న్యాయం వైపే నిలబడుతుందన్నారు.