ఖమ్మం (Khammam) రాజకీయాలు వాడీవేడి విమర్శలతో, ఆరోపణలతో హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్.. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు మధ్య మాటల యుద్ధం.. ప్రపంచ యుద్దాన్ని తలపిస్తుందని అనుకుంటున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రతీ రోజు రోడ్ షోలు నిర్వహిస్తూ బీఆర్‌ఎస్ పాలనపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా రఘునాథ పాలెం మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తుమ్మల.. మరోసారి పువ్వాడ అజయ్ (Puvvada Ajay)ని టార్గెట్ చేశారు. పువ్వు వికసించినట్టు పువ్వాడ వికసించాడు కానీ ప్రజల కోసం కాదు.. ఆస్తులు పెంచుకోవడం కోసం అని ఎద్దేవా చేశాడు. పువ్వాడ కనుసన్నల్లో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwararao) విమర్శించారు.
తాను లోకల్ అంటున్నపువ్వాడ.. లోకల్ అయితే అక్రమంగా గుట్టలు తవ్వుకోవచ్చా? సాగర్ కాలువ భూములు కబ్జా చేయొచ్చా? అని తుమ్మల ప్రశ్నించాడు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అరాచకం, అవినీతి, కబ్జాలు ఖమ్మం లో రాజ్య మేలుతున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ను బొందపెడితే కానీ రాష్ట్రం బాగుపడదని తుమ్మల అన్నారు.