టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి బీఆర్ఎస్ (BRS)పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ (KCR) అవినీతికి మేడిగడ్డ ప్రాజెక్టు బలైందని ఇవాళ సోషల్ మీడియా (Social media) (X)వేదికగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress) హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయని అభివృద్ధి జరిగిందని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి.. కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాలని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో మార్పు కావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. మరోవైపు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రేవంత్రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు బాగుండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్వామి వారి దర్శనం అనంతరం రేవంత్రెడ్డి దంపతులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.