Telugu News » Revanth : 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ!

Revanth : 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ!

సంచలనం కోసమే ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి ఘటనలో కాంగ్రెస్ ప్రమేయం లేదని స్పష్టంగా ఎస్పీనే చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

by admin
tpcc-revanth-reddy-strong-counter-to-minister-ktr

కేసీఆర్ (KCR) ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth) సవాల్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ఎక్కడికి రమ్మన్నా వస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad) లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపించలేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని రెడ్డి స్పష్టం చేశారు.

tpcc-revanth-reddy-strong-counter-to-minister-ktr

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వరుస కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు రేవంత్. డీకే శివకుమార్‌ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని, ఫాక్స్‌ కాన్‌ ను బెంగళూరు తరలిస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి ప్రదర్శనలు చేయిస్తున్నారని ఫైరయ్యారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వట్లేదని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

ఇక, గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని అన్నారు రేవంత్. ప్రశాంత్‌ కిషోర్​ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్‌ లో మమతా బెనర్జీ కాలి గాయం ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఆయన డబ్బులు పంచడానికి వెళ్తున్నారని పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయినా, అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంచలనం కోసమే ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి ఘటనలో కాంగ్రెస్ ప్రమేయం లేదని స్పష్టంగా ఎస్పీనే చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో మూడు కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఎన్నికల అధికారులు ఎందుకు ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవడం లేదని నిలదీశారు. మేడిగడ్డ కుంగినప్పుడు తొలుత కుట్ర ఉందని, ఆ తర్వాత నిర్వహణా లోపం అన్నారని మండిపడ్డారు.

మరోవైపు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కూడా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో ఒవైసీ పార్టీ ఇచ్చాడని అన్నారు. దర్గాకి రమ్మన్నా వస్తా.. భాగ్యలక్ష్మి ఆలయానికి రమ్మన్నా వస్తా.. ఒవైసీ మసీదులో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అంటూ చాలెంజ్ చేశారు. ఒవైసీ శర్వాణీ లోపల ఫైజమా ఉందని అనుకున్నా.. శర్వాణీ కింద కాకీ నిక్కర్ ఉందని అర్థమైందన్నారు. ఒవైసీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతుగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

You may also like

Leave a Comment